పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్న నేడు ఇలా వరుసగా ప్రతి రోజు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ పై 35 పైసల చొప్పున పెరుగుదల కనిపించింది. పెరిగిన ధరలతో హైదరబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.17 గా ఉండగా డీజిల్ ధర రూ.104.29 గా ఉంది.
ఇక విజయవాడ లో తాజాగా పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35 కు చేరగా….డీజిల్ ధర రూ.105.88 గా ఉంది. ఇక సెప్టెంబర్ చివరి వారం నుండి ఈరోజు వరకు పెట్రోల్ ధరలు మొత్తం 18 సార్లు పెరిగాయి. అంతే కాకుండా డీజిల్ ధరలు కూడా 21 సార్లు పెంచారు. ఇక పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు ఇంధనం ధరలు 5పైసలు పెరిగాయంటే ధర్నాలు రాస్తరోకోలు చేసేవారు. కానీ ఇప్పుడు ధరలు ప్రతి రోజూ పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.