దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గించింది. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్పై రూ. 5, డిజిల్ పై రూ. 10 తగ్గించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెరుగుతన్న ఇంధన ధరలకు ఈ చర్యతో కళ్లెం పడింది. తాజాగా మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోవడంతో మరింతగా పెట్రోల్ ధరలు దిగి రానున్నాయి. 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్ పై పన్నులను తగ్గించాయి. దీంతో ప్రజలపై పెట్రోల్ భారం తగ్గనుంది.
పెట్రోల్ రేట్లను మరింత తగ్గించిన 9 రాష్ట్రాలు..
-