గడిచిన కొన్ని రోజులుగా పెట్రోల్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. రోజు రోజుకీ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని దాటి పోతున్నాయి. వాహనదారులకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ పెట్రోల్ రేటు 100దాటింది. రేట్లు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయనే విషయం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మీద విమర్శలు వస్తునే ఉన్నాయి. ఐతే తాజాగా అసోంలో మాత్రం పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయి.
లీటరుపై 5రూపాయలు తగ్గించేందుకు అసోం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రీల్ రేట్లు తగ్గిస్తున్నట్లు, తగ్గిన రేట్లు ఈ రోజు అర్థరాత్రి నుండి అమల్లోకి వస్తాయని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వ తెలిపారు. అదనపు సెస్ తగ్గించడం వల్ల పెట్రోల్ రేట్ల తగ్గింపు సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. దేశమంతటా పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే అసోంలో తగ్గడానికి కారణాలు ముందున్న ఎలక్షన్లే అని చాలా మంది అంటున్నారు.