పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చెయ్యాలా..? ఇలా చెయ్యండి..లేకపోతే రావు..!

-

చాలా మందికి పీఎఫ్ అకౌంట్ వుంది. మీకు కూడా పీఎఫ్ అకౌంట్ ఉందా….? ప్రతీ నెలా మీ జీతం లో డబ్బులు అందులో జమ అవుతున్నాయా..? అయితే ఇది మీరు పక్కా తెలుసుకోవాలి. మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును విత్‌ డ్రా చేయాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ ని అప్డేట్ చెయ్యాలి.

లేదంటే డబ్బులు రావు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో పడిన డబ్బులని పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చెయ్యచ్చు. రిటైర్ లేదా వైదొలిగిన రెండు నెలల తర్వాత పీఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బులని తీసుకోవచ్చు. పీఎఫ్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన దానిలో కొంత డబ్బుని మీరు వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, హోమ్ లోన్ వంటి వాటి కోసం తీసుకోవచ్చు. అయితే రిటైర్ అవడానికి ముందు పీఎఫ్ అమౌంట్ ని డ్రా చెయ్యాలంటే కొన్ని పత్రాలను అప్‌డేట్ చేసుకోవడం ముఖ్యం.

ఇవి అవసరం అవుతాయి:

రెండు రెవెన్యూ స్టాంపులు, క్లెయిమ్ ఫారం కావాలి. అలానే బ్యాంక్ ఖాతా వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్, IFSC కోడ్ ఇవ్వాల్సి వుంది. బ్యాంక్ ఖాతా నెంబర్‌తో క్యాన్సిల్ద్ చెక్కు
పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాలని ఇవ్వాలి. ప్రతి సంవత్సరం PF ఖాతాలో జమ చేసిన ITR ఫారమ్ 2, 3ని సబ్మిట్ చేయాల్సి వుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version