ఈ జీన్స్ ఖరీదు రూ.94 లక్షలు..ఎందుకో తెలుసా?

-

ఒక జీన్స్ ధర ఎంత ఉంటుంది 1000 నుంచి మొదలుకొని లక్ష వరకు ఉండోచ్చు..క్వాలిటీ, బ్రాండ్ ఇంకా దాని ప్రత్యేకతలను బట్టి దాని కాస్ట్ ఉంటుంది.. అయితే, ఇప్పుడు మనం చెప్పుకొనె జీన్స్ ఖరీదు ఏకంగా రూ.94 లక్షలు..ఏంటీ..అంత రేటు ఎందుకు..ఇది నిజమా అని ఆశ్చర్య పోతున్నారు కదూ..కానీ, ఇది నిజం..ఆ జీన్స్ పురాతన కాలంనాటిది.దాని ప్రత్యేకతల వల్ల అంత ధరకు అమ్ముడు పోయిందని అంటున్నారు.మరి ఆలస్యం ఎందుకు దాని గురించి ఇప్పుడే తెలుసుకుందాం..

ఇది చాలా పురాతనమైన తెల్లటి రంగు జీన్స్..దీన్ని అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఓడ శిథిలాల్లో దొరికింది. నివేదికల ప్రకారం, 1857లో ఓడ మునిగిపోయింది. ఈ జీన్స్ ను అదే ఓడకి చెందిన శిథిలాల నుండి కనుగొన్నారు.. అంటే ఇది 165 ఏళ్ళ క్రితం నాటిది..దాన్ని వేలంలో పెట్టగా, ఏకంగా రూ.94 లక్షలు పలికింది( $ 114000).లెవీ స్ట్రాస్ మరియు కో కంపెనీ తయారు చేసింని కొందది కావచ్చరు అంటున్నారు. అయితే అధికారికంగా.. ఈ కంపెనీ 1873 సంవత్సరంలో తన మొదటి జీన్స్‌ను తయారు చేసింది. మరికొందరు ఈ ఏ కంపెనీ జీన్స్ అంటే.. అప్పట్లో లెవీ స్ట్రాస్‌ కంపెనీ డ్రై గూడ్స్‌ అనే హోల్‌సేల్‌ కంపెనీ ఉండేదని చెబుతున్నారు.

ఇది ఓ ఓడ చెత్త కుప్పలో దొరికిందట..ఈ పాత జీన్స్ ను ఎవరూ తయారు చేశారు అనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్న లాగా మిగిలింది. ఇది సెప్టెంబర్ 12, 1857 కంటే ముందు తయారు చేయబడిందని ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ జీన్స్ కనుగొనబడిన ఓడ శిధిలాలే దీనికి ఆధారం. ఈ ఓడ1857లో సముద్రంలో తుఫాను కారణంగా అప్పుడు సముద్రంలో మునిగిపోయింది.. అందులో ఇది వుంది..మరి ఆ జీన్స్ గురించి తెలియక పోయిన కూడా అన్నీ లక్షలు పలకడం విశేషం..ఈ జీన్స్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version