వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతికి అందుతున్న ట్రీట్‌మెంట్‌పై ఆమె తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నిమ్స్‌లో తన కుమార్తెకు సరైన వైద్యం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ట్రీట్‌మెంట్ అందించి తన కుమార్తెను కాపాడాలని కోరారు.
‘‘వరంగల్ ఎంజీఎంలోనే సరైన వైద్యం అందినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదు. నా కుమార్తెక ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఎంజీఎంలో గొడవ అవుతుందని.. ఆస్పత్రి పరువుపోతుందని ఇక్కడికి తరలించారు. నా కుమార్తెకు జరుగుతున్న వేధింపులపై స్థానిక పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పినా వారు సరిగా స్పందించలేదు. ఆర్పీఎఫ్‌లో పనిచేసే నేను.. ఆత్మహత్యలు చేసుకునేందుకు యత్నించిన ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇచ్చాను. చివరికి నా కుమార్తెకు ఈ గతి పట్టింది. దీనికి కారణమైన హెచ్‌వోడీ, సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.’’ అని నరేందర్ కోరారు.