ఫాల్గుణ అమావాస్య నాడు ఈ మార్గాలని అనుసరిస్తే శుభం కలుగుతుంది..!

-

ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం అమావాస్య హిందువులకి పర్వదినం. దీనిని ఫాల్గుణ అమావాస్య అంటారు. ఈసారి దీని యొక్క విశేషత మరింత ఎక్కువ. ఎందుకంటే దేవ ప్రతి కార్య మరియు శంకరాచార్య అమావాస్య ఒక్క రోజే వచ్చాయి. ఈ శనివారం ఇది వచ్చింది. పండితులు చెప్పిన దాని ప్రకారం నాలుగు గ్రహాలు కూడా అమావాస్య నాడు వస్తాయి.

సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు కూడా కుంభ రాశి లో వస్తాయి. దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ అని పండితులు అంటున్నారు. ఈ శని అమావాస్య కి ప్రత్యేకత చాలా ఉంటుందని చెప్పడం జరిగింది. పితృ దోషం, కాలసర్ప దోషం, అమావాస్య దోషాలు వంటివి ఈ రోజు తొలగించుకోవచ్చట.

శనీశ్వర అమావాస్య నాడు పితృదేవతల గురించి మాత్రమే కాకుండా ఆ రోజు శని దేవుని మంత్రం ఉపవాసం చేయడం మంచిది. అలానే నల్ల బట్టలు దానం చేయడం, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, గొడుగు వంటివి దానం చేస్తే దోషాలు పోతాయి.

హనుమంతునికి పూజించడం, రావి చెట్టు వద్ద దీపం పెట్టి ప్రదక్షిణం చేయడం, శమీ పూజ చేయడం, గోవుని పూజించడం లాంటివి చేస్తే శుభం కలుగుతుంది. 12 మార్చి 2021 మధ్యాహ్నం 3:00 గంటలకు అమావాస్య ప్రారంభం అవుతుంది. 13 మార్చి 2021 న ఉదయం 03:52 గంటల తో అమావాస్య ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version