ఫేక్ కరెన్సీ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగా ఫేక్ కరెన్సీ వచ్చిందా..? ఈ 500 రూపాయిల నోట్లు చెల్లవ..? ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా వచ్చిన వీడియో ప్రకారం ఈ ఐదు వందల రూపాయిల నోట్లు చెల్లవని ఒక వార్త వచ్చింది. కొన్ని రోజులు నుండి కూడా ఆ వార్త సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలు ఆ వార్తలో ఏముంది అనేది ముందు చూస్తే.. మహాత్మా గాంధీ ఫోటో కి దగ్గర రెండు ఆకు పచ్చ రంగు స్ట్రైప్స్ ఉన్నాయని.. ఇలా ఉన్న రూ.500 నోట్లు ఫేక్ అని.. ఇవి చెల్లవని ఆ వీడియోలో ఉంది. అదే విధంగా నిజమైన నోట్లకి అయితే ఆకుపచ్చ రంగు స్ట్రైప్స్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం దగ్గర వున్నాయి అని… అవి నిజమైన నోట్లు అని ఉంది.
అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో అనేది చూస్తే.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ వార్త అని ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పింది. అయితే చాలామంది ఈ వీడియో నిజం అనుకుని నమ్మి ఈ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. కానీ నిజానికి ఇది ఫేక్ వార్త. ఇలాంటి నకిలీ వార్తల్ని అనవసరంగా నమ్మి మోసపోకండి అదే విధంగా ఈ వార్తని ఫార్వర్డ్ చేయడం కూడా మంచిది కాదు. కనుక ఇలాంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అన్నిటినీ నమ్మి మోసపోవద్దు.