టేబుల్ మీద ఈ మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది…!

-

సాధారణంగా మనం ఇళ్లల్లో కాఫీ టేబుల్స్, కంప్యూటర్ టేబుల్స్ వంటి వాటి పై చిన్న చిన్న మొక్కలు పెంచితే చాలా అందంగా ఉంటుంది. ఇలా చిన్నచిన్న మొక్కలు పెట్టడం వల్ల ఏకంగా ఇంటికి అందం వస్తుంది. అయితే ఎటువంటి మొక్కల్ని కాఫీ టేబుల్స్ మీద పెడితే బాగుంటుంది…?, సులువుగా ఏ మొక్కలని మనం వాటిపై పెంచవచ్చు…? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యమెందుకు పూర్తిగా దీని కోసం చూసేయండి.

టేబుల్స్ మీద పెంచుకునే మొక్కలు:

Cactus:

టేబుల్ మీద చిన్న చిన్న ముళ్ళతో చాలా అందంగా ఉంటుంది. టేబుల్ మీద వీటిని పెడితే గదికే అందం వస్తుంది. చిన్నచిన్న కుండీలలో వీటిని వేసి టేబుల్ మీద పెట్టొచ్చు. పైగా వీటికి ఎక్కువ నీళ్లు అక్కర్లేదు. అలానే సూర్యకిరణాలు కూడా ఎక్కువగా తగలక్కర్లేదు. మొత్తమంతా ఆకుపచ్చగా ఉండి మంచి అందాన్ని ఇస్తాయి. వీటిని టేబుల్ మీద పెట్టుకోవచ్చు.

కలబంద:

కలబంద మొక్కల్ని కూడా అందమైన కుండీలో వేసి టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇంటి లోపల వీటిని పెంచుకోవడం చాలా సులువు. కలబందని మనం ఇళ్లలో పెంచి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మన ఉపయోగించుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న గాయాలైన, స్కిన్ ఇరిటేషన్ లాంటివి కలిగినా కూడా కలబంద ఉపయోగించవచ్చు. అందానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.

మనీ ప్లాంట్:

దీనిని జేడ్ ప్లాంట్ అని అంటారు. దీనిని కూడా మనం మీ ఇళ్లలో ఉన్న టేబుల్ మీద పెట్టుకుని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. దీని కోసం కూడా పెద్దగా శ్రద్ధ తీసుకోక్కర్లేదు. పైగా ఎక్కువ నీళ్లు సూర్యకిరణాలు కూడా దీనికి అవసరం లేదు. ఎంతో సింపుల్ గా వీటిని పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version