కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… ఆహార ప్రాసెసింగ్ రంగానికి పిఎల్‌ఐ స్కీమ్ …!

-

సబ్సిడీ కింద 10,900 కోట్ల రూపాయిలు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ మరియు పియూష్ గోయల్ ఈ సమాచారాన్ని ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్యాబినెట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కి 10,900 రూపాయల సబ్సిడీని ఇస్తున్నట్లు చెప్పారు. పిఎల్ఐ స్కీం కింద క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ని పిఎల్ఐ తో లింక్ చేశారు అని పియూష్ గోయల్ చెప్పారు.

దీని వల్ల రైతులకు బెనిఫిట్ కలగనుంది. అలానే రైతులకు కూడా ఆదాయాన్ని పెంపొందించే ప్లాన్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో రైతులు ఎక్కువ అయ్యారని ఈ సంవత్సరం 3.5 శాతం రైతులు పెరిగారని అన్నారు. అలాగే ప్రధాన నరేంద్ర మోడీ మరియు నరేంద్ర తోమర్ రైతులు ఆదాయాన్ని ఎలా పెంపొందించాలి అనే విషయంపై చర్చించారు అని గోయల్ చెప్పారు.

అలానే రైతులకి కావాలి అంటే పంటల్ని నచ్చిన దగ్గర అమ్ముకోవచ్చని చెప్పారు. అలాగే రైతుల భూమిని ఎక్కడికి ఇవ్వడం లేదని ఎక్కడ డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకోవచ్చని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం వేరేగా ఫుడ్ సెక్టార్ కి మంచి గుర్తింపు తీసుకు వస్తుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన విషయాలను చర్చిస్తోందని ముఖ్యంగా రైతుల పై శ్రద్ధ పెడుతోందని.. వాటిలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్ణయం కూడా ఒకటని చెప్పారు. ఇది ఇలా ఉంటే యూనియన్ మినిస్టర్ పియూష్ గోయల్ రెండున్నర లక్షల యువతకి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించనున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version