ప్రధాని మోదీ మాపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. నేడు సిద్దిపేట నియోజకవర్గ రాఘవాపూర్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనలో ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఇక ఈ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రేమ, ఆప్యాయత చూస్తుంటే తనకు కళ్ళలో నీరు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. పదవులు నేడు ఉండొచ్చు, రేపు పోవచ్చు కానీ.. ప్రేమ, ఆప్యాయత ముందు ఏమీ పనికిరావన్నారు.