డిజిటల్ వ్యవసాయం వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చబోతోందని… యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రధాన మోదీ అన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సహజ సేద్యం, డిజిటల్ వ్యవసాయానికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తుందని అన్నారు. వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగం అని ఆయన అన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ప్రపంచ స్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందన్నారు. ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
డిజిటల్ వ్యవసాయాన్ని యువకులు అందిపుచ్చుకోవాలి- ప్రధాని నరేంద్రమోదీ.
-