Poco M4 5G బడ్జెట్ స్మార్ ఫోన్.. సేల్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే..!

-

పోకో నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పోకో ఎం4 5జీ ( Poco M4 5G) రూ. 13 వేలలోనే మంచి ఫీచర్స్ తో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ ఫోన్ రివ్యూ చూద్దాం.

Poco M4 5G ధర

ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి..4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎం4 5జీ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.
6జీబీ + 128జీబీ వేరియంట్ రూ.14,999తో లాంచ్ అయింది.

సేల్ ఆఫర్..

మే 5 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ సేల్‌ మొదలవనుంది…SBI క్రెడిట్ కార్డుతో Poco M4 5G మొబైల్‌ను కొంటే రూ.2,000 డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ మోడల్‌ను రూ.10,999కే దక్కించుకోవచ్చు. పోకో ఎల్లో, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యమవుతుంది.

Poco M4 హైలెట్స్..

పోకో ఎం4 5జీ మొబైల్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌ ఉంటుంది.

గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 2జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను పొడిగించుకునే టర్బో ర్యామ్ ఫీచర్‌ను పోకో ఈ మొబైల్‌లో ఇచ్చింది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా స్లాట్ ఉంది.

ఆండ్రాయిడ్‌ 12తో కూడిన MIUI 13 ఓఎస్‌పై ఈ మొబైల్‌ రన్ అవుతోంది.

6.58 ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లేను Poco M4 5G కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది.

ఇక కెమేరా విషయానికి వస్తే.. Poco M4 5G వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ పోట్రయిట్ సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పోకో అందిస్తోంది.

వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP52 రేటింగ్‌తో ఈ మొబైల్‌ వస్తోంది. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌ 8.9 మిల్లీమీటర్ల మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది.

5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ మొబైల్‌ వస్తోంది.

Poco M4 5G మొబైల్‌లో 5000mAh బ్యాటరీ ఉండగా.. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version