హత్యలు, అత్యాచారాల్లో టీడీపీ నేతలే ఎక్కువ… ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హత్యలు, అత్యాచారాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో వరసగా ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పతిలో జరిగిన అత్యాాచారంలో టీాడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఘటన మరవక ముందే తాజాగా రేపల్లి రైల్వే స్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రస్తుతం నెల్లూర్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హోమంత్రి తానేటి వనిత బాధితురాలిని పరామర్శించారు. హత్యలు, అత్యాచారాల్లో టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారని హోమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఇలాంటి దాడుల జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను  అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. బాధిత మహిళకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు. దళిత మహిళపై ఎవరైతే అత్యాచారం చేశారో వారిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ, 376 డీ, 394 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆమె వెల్లడించారు. వనితతో పాటు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version