నేడే లాంచ్‌ కానున్న Poco M5.. ధర బడ్జెట్‌లోనే..!

-

పోకో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్‌ కానుంది. పోక్ ఎం5 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ ఈరోజు సాయంత్రం 5.30గంటలకు ఫిక్స్‌ చేశారు. మనదేశంలో కూడా ఈ ఫోన్‌ ఈరోజే లాంచ్‌ కానుంది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇందులో డ్యూయల్ టోన్ డిజైన్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు కెమెరాలు నిలువుగా ఉన్నాయి. ముందువైపు వాటర్ డ్రాప్ తరహా నాచ్‌లో ఫ్రంట్ కెమెరాను అందించారు. అయితే వెనకవైపు కెమెరా మాడ్యూల్ మాత్రం ఫోన్ పైభాగంలో దాదాపు పావు భాగాన్ని ఆక్రమించింది.
పోకో ఎం5 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
డ్యూయల్ సిమ్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
పోకో ఎం5 ధర (అంచనా)
దీని ధర రూ.15 వేలలోపే ఉండనుంది. 4జీ ఫోన్ సరిపోతుంది అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.
ఈ విభాగంలో రియల్‌మీ సీ-సిరీస్, నార్జో 50 సిరీస్ ఫోన్లతో పోకో ఎం5 పోటీ పడనుంది. దీంతోపాటు రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ల నుంచి కూడా పోకో ఎం5కు గట్టీ పోటీ ఉంటుంది. దీని ధర ఎంతో తెలియాలంటే మాత్రం లాంచ్‌ అయ్యేవరకూ ఆగాల్సిందే. ఈ ఫోన్‌ ఈరోజు రిలీజ్‌ అవుతుంది. రేపు అంటే సెప్టెంబర్‌ 6న రెడ్‌మీ నుంచి మూడు ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. దాదాపు అన్నీ బడ్జెట్‌ ఫోన్లే కావడంతో.. కాంపిటీషన్‌ బానే ఉండబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version