నిన్న భారత్ న్యాయ్ జొడో యాత్రలో భాగంగా వారణాసిలో అభివృద్ధే కనిపించడం లేదని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తర ప్రదేశ్ యువత తాగుడుకు బానిసలయ్యారు అని ,తాగి అర్ధరాత్రి రోడ్లపై డాన్సులు వేస్తున్నారు అని విమర్శించారు. బాధ్యతలు వదిలేసి జులాయిగా యువత తిరుగుతుంటే రామమందిరం అంటూ నరేంద్ర మోదీ ప్రచారం చేసుకుంటున్నారు అని ఆరోపించారు . అదానీ,ముఖేష్ అంబానీలనే ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకుంటారు కాని దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలను ఆయన పట్టించుకోరు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి’ అని రాహుల్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ పై ఆయన మెదడులో ఎంత విషం దాగి ఉందో అర్థమవుతోంది అని ఘాటుగా స్పందించారు.అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించారు అని విమర్శించారు. ఇప్పుడు వారణాసి యువతపై అభ్యంతరకరంగా మాట్లాడారు. సోనియా గాంధీ తన కొడుకును మంచిగా పెంచలేకపోతే.. కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పండి’ అని సూచించారు.