కారులో ఆయుధాలు.. చేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు

-

అక్రమార్కులు కొత్త కొత్త పంథాలతో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే.. కొందరు దుండగులు పోలీసులు కళ్లుగప్పి ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులు చిక్కారు. అయితే.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన దుండగులను సినీ ఫక్కీలో చేజ్‌ చేశారు పోలీసులు. దుండగుల కారును ఏకంగా 90 కిలోమీటర్లు చేజ్‌ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే దుండగులు కారును వదిలి పారిపోయారు. అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఉదయం ఇండోర్‌లో ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై హర్యనా రిజిస్టర్డ్‌ కారును అడ్డగించారు.

అయితే, నలుగురు దుండగులు కారును ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మరింత వేగంగా పోనిచ్చారు. దాంతో పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఒకచోట దుండగులు పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టారు. చివరకు ఇండోర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని ఖల్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ బారీకేడ్‌లను ఢీకొట్టి కారును అక్కడే వదిలేసి నలుగురు దుండగులు పారిపోయారు. దాంతో కారులో వెతికిన పోలీసులకు భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. అందులో 40 పిస్తోల్‌లు, 36 మ్యాగజీన్‌లు, ఐదు క్యాట్రిడ్జ్‌లు ఉన్నాయి. ఈ ఆయుధాలు విదేశాల్లో తయారయినవని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version