మారని పోలీసుల తీరు.. కాంగ్రెస్ నాయకుడి పుట్టిన రోజున స్వీట్స్ తినిపిస్తున్న పోలీసులు..!

-

తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఓ పోలీస్ ఉన్నతాధికారి బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలపడంతో ఆ అధికారిని ఎన్నికల కమిషన్ కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం తిరిగి విధుల్లో చేరారు. మరోవైపు  ప్రభుత్వంలో ఏ పదవీ లో లేకపోయినా కాంగ్రెస్ నాయకుల ఇంటికి వెళ్లి మరీ వారి పుట్టినరోజు నాడు స్వీట్స్ తినిపిస్తున్నారు పోలీసులు.

తాజాగా సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, సూర్యాపేట మండల రూరల్ ఎస్సై బాలు నాయక్, ఆత్మకూర్ (ఎస్) మండల ఎస్సై సైదులు గౌడ, చివ్వేంల మండల ఎస్సై వెంకట్ రెడ్డి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని స్వీట్లు తినిపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో ఏకంగా  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు పాలాభిషేకం చేశారు ఎక్సైజ్ పోలీసులు. దీంతో పలువురు అధికార పార్టీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఇలాంటి ఘటనలు చూస్తే.. స్పష్టంగా అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version