మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదు దారులకు సిబ్బంది అందుబాటులో లేరని సమాచారం.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు లీక్ అవడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.పోలీస్‌స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.