మతాంతర వివాహానికి షాక్ ఇచ్చిన పోలీసులు…!

-

చట్ట విరుద్ధమైన మతమార్పిడిని అడ్డుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ చేసిన వారం తరువాత కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నోలో పోలీసులు ఒక హిందూ మహిళ మరియు ఒక ముస్లిం పురుషుడి మధ్య వివాహ వేడుకను అడ్డుకున్నారు. ఈ వివాహం బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో జరగాల్సి ఉంది.

వేడుకలు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు, ఒక పోలీసు బృందం వేదిక వద్దకు చేరుకున్నారు. రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కి రావాలని ఆదేశించారు. లక్నో జిల్లా మేజిస్ట్రేట్ నుండి వివాహానికి ముందుగా అనుమతి పొందాలని ఇరువర్గాలు కోరినట్లు పోలీసులు తెలిపారు. లవ్ జీహాద్ కి వ్యతిరేకంగా ఇటీవల చట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారికి నూతన చట్టం గురించి తెలియదు అని అందుకే ఇలా చేసుకుంటున్నారు అని పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version