రాహుల్ గాంధీకి నోటీసులు అందించిన పోలీసులు….

-

ఢిల్లీ పోలీసులు నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి ఆదివారం వేకువజామున వెళ్లారు. లా అండ్ ఆర్డర్ స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసులు రాహుల్ గాంధీకి నోటీసులు అందించారు. . భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన ఓ వ్యాఖ్య గురించి సమాచారం ఇవ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారులు.. రాహుల్‍ను కలిసేందుకు వచ్చారు. “ఇప్పటికీ మహిళలు లైగింక వేధింపులకు గురవుతున్నారు” అంటూ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ మాట్లాడారు.. దానిపై స్పందించకపోవడంతో ఈరోజు నేరుగా ఆయన ఇంటికే వెళ్లారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసిన ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. వివరాలు తెలుపాలంటూ రాహుల్ గాంధీకి ప్రశ్నావళిని పంపారు. ఆయన దానికి ఇంకా స్పందించలేదు. “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారని నేను వింటున్నాను” అని శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ అన్నారని పోలీసులు చెప్పారు. ఆ మహిళలు ఎవరో రాహుల్ గాంధీ చెబితే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. స్పెషల్ పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని పోలీసు బృందం రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. వేధింపులకు గురవుతున్న మహిళలు ఎవరంటూ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version