శంకర్, కమల్ కి మరో షాక్…!

-

కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారతీయుడు 2. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం చిత్ర సీమను భయపెట్టిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్ పడిపోవడంతో ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోగా శంకర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శంకర్ కి భారీ గాయాలే అయ్యాయి.

అయితే శంకర్ కి సంబంధించి ఏ ఫోటో బయటకు రాలేదు. ఆయన ఎక్కడ చికిత్స పొందుతున్నారు అనేది స్పష్టత రావడం లేదు. దీనితో తమిళ పరిశ్రమలో ఆందోళన మొదలయింది. ఇక ఈ ప్రమాదం కి సంబంది కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాధమిక దర్యాప్తులో ప్రమాదమే అని గుర్తించారు. దీనిపై ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. కమల్ హాసన్ మరణించిన వారికి కోటి సహాయం చేసారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు శంకర్ కి, హీరో కమల్ హాసన్ కి నోటీసులు జారి చేసారు. . నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాతలు, క్రేన్‌ యజమాని, ఆపరేటర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌పై కేసులు నమోదు చేసారు. నటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీచేశారు. కాగా.. ఈ సమన్లపై ఇంతవరకూ కమల్, శంకర్ స్పందించలేదు. జరిమానా కూడా విధించే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version