ఉద్యోగ ప‌ర్వంలో ఉద్య‌మ స్ఫూర్తి .. సెబ్బాస్ రా కేసీఆర్

-

ఇంతకాలం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పెద్ద లోటు ఉందంటే అది నిరుద్యోగ అంశమే…అసలు తెలంగాణ రావడానికి ప్రధాన కారణమే నిరుద్యోగం…నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాల ఫలితమే తెలంగాణ…ఇక ప్రత్యేక రాష్ట్రం వచ్చాక…

తెలంగాణ నిరుద్యోగులకు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నారు…కానీ అనుకున్నది జరగలేదు..నిరూద్యోగులకు రాష్ట్రం వచ్చిన న్యాయం జరగలేదు…ఉద్యోగాలు రాలేదు..అయితే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా నిరుద్యోగులకు ఒరిగింది ఏమి లేదు..అయితే రోజురోజుకూ నిరుద్యోగుల ఆందోళనలు పెరిగిపోయాయి.

అటు ప్రతిపక్షాలు సైతం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నాయి..రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి…అలాగే నిరుద్యోగులు..కేసీఆర్ ప్రభుత్వంపై బాగా కోపంతో ఉన్నారు..పైగా కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి..ఇదే క్రమంలో కేసీఆర్ ఉన్న వ్యతిరేకతని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..అందుకే ఈ మధ్య బీజేపీపై ఎక్కువ ఫోకస్ పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు.

అలాగే తాజాగా నిరుద్యోగులని సంతృప్తి పరిచేందుకు ఏకంగా 90 వేల ఉద్యోగాలని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు… మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అలాగే  11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు చెప్పారు. తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. పైగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇలా అనూహ్యంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా టీఆర్ఎస్‌కు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది..అలాగే టీఆర్ఎస్ నేతల రాజకీయ ఉద్యోగాలు కూడా నిలబడతాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version