నెల్లూరులో హీటెక్కిన రాజకీయం..సోమిరెడ్డి వర్సెస్‌ కాకాణి..!

-

నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది.. మాజీ మంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి.ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది..తాజాగా సోమిరెడ్డికి సంబంధించిన వీడియా వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యింది..జెన్‌కో యాష్ పాండ్‌లో సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతిపరుడంటూ కొన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.. అలాగే సోమిరెడ్డి ఫ్లెక్సీలతో వైసీపీ శ్రేణులు ఊరేగింపు చేశారు..సోమిరెడ్దికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని కాకాని విమర్శించారు..మరోవైపు తనకు సింగపూర్‌లో ఆస్తులు ఉన్నట్లు నిరూపించండని..అందరికి హాంకాంగ్,సింగపూర్‌, మలేషియాకు టికెట్లు బుక్ చేస్తా ఆస్తులను నిరూపించండి అని సోమిరెడ్డి కాకానికి సవాల్ విసిరారు.. ధాన్యం కొనుగోళ్లలో కాకాణి అక్రమాలకి పాల్పడ్డారని సోమిరెడ్డి విమర్శించగా.. యాష్ పాండ్‌లో సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని కాకాణి ప్రధాన ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version