వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ…

-

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ అభివృద్ధి అనేది చిన్నచిన్న నగరాల అభివృద్ధి తోనే సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పరచాలంటే అది చిన్న చిన్న నగరాల అభివృద్ధితోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఇండియాను అభివృద్ధి చెందిన దేశాల మధ్య నిలబెట్టే సంకల్పం లో భాగమైన ‘మోడీ హామీ వాహనం’దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటుందని చెప్పాడు. ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావించి వారికి వివిధ పథకాలలను వర్తింప చేసి వారికి సహాయం చేస్తున్నామని తెలియజేశాడు.

కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వాలు పెద్ద నగరాల అభివృద్ధిపైనే ఫోకస్ చేశాయని తమ ప్రభుత్వం మాత్రం చిన్న చిన్న నగరాల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తుందని తెలిపాడు.బిజెపి ప్రభుత్వం వికసి భారత్ సంకల్ప యాత్రను గత నెల నవంబర్ 15 ప్రారంభించిన సంగతి తెలిసిందే.కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ ఎత్తి వేయడంతో ఆయా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నిబద్ధత కలిగి ఉండి సక్రమంగా పనిచేసే వారి కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడు సహాయపడుతుందని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version