5 వైసీపీకి…5 టీడీపీకి?

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి…ఇప్పటివరకు అన్నీ జిల్లాలోనూ అధికార వైసీపీదే ఆధిక్యం అనే పరిస్తితి…ఇప్పుడు ఆ పరిస్తితి నిదానంగా మారుతున్నట్లు తెలుస్తోంది..సంక్షేమ పథకాలు ఒకటే వైసీపీని సేవ్ చేసే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది. ప్రజలపై పన్నుల భారం పెంచడం, సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో అండగా నిలబడకపోవడం, కొత్త కంపెనీలు పెద్దగా తీసుకురాకపోవడం, అలాగే ఏపీకి అసలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్తితి తీసుకురావడం…ఇలా చాలా కారణాల వల్ల వైసీపీకి యాంటీ పెరుగుతుందని, పైగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగా మైనస్ అవుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో రాష్ట్రంలో వైసీపీనే లీడ్‌లో ఉందని, కానీ గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి మాత్రం లేదని సర్వేల్లో తేలింది. అలాగే టీడీపీ పలు జిల్లాల్లో పుంజుకుంటూ వస్తుందని తెలుస్తోంది.

ఓవరాల్‌గా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు 13 ఉన్నాయి…గత ఎన్నికల్లో 13 జిల్లాల్లోనూ వైసీపీ హవా నడిచింది…మెజారిటీ సీట్లు వైసీపీనే గెలుచుకుంది. కానీ ఈ సారి పరిస్తితి అలా లేదు..కొన్ని జిల్లాల్లో వైసీపీ లీడ్ తగ్గుతూ వస్తుంది. ఇదే క్రమంలో కొన్ని జిల్లాల్లో టీడీపీ లీడ్‌లోకి వచ్చినట్లు సర్వేలు చెబుతున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి లీడ్ కనిపిస్తోంది.

అయితే టీడీపీతో-జనసేన పొత్తు ఉంటే దాదాపు 80 శాతం సీట్లు గెలుచుకోవచ్చని తెలుస్తోంది. ఇక వైసీపీ లీడ్‌లో ఉన్న జిల్లాలు వచ్చి..విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలు. అయితే విశాఖపట్నం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయట. అయితే విశాఖలో కాస్త టీడీపీకి, ప్రకాశం, అనంతల్లో కాస్త వైసీపీకి ఎడ్జ్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి వైసీపీదే లీడ్. కానీ టీడీపీ-జనసేన పొత్తు మాత్రం వైసీపీకి రిస్కే.

Read more RELATED
Recommended to you

Exit mobile version