ఓ వైపు పవన్ కళ్యాణ్…వైసీపీపై పోరాటం చేస్తున్నారు…ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని పవన్ చూస్తున్నారు. అవసరమైతే ఓట్లు చీలకుండా ఉండటానికి పొత్తుకు కూడా రెడీ అని పవన్ చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్నారు. మరి అలాంటప్పుడు పవన్ వల్ల వైసీపీకి ప్లస్ ఎలా అవుతుందని అనుకోవచ్చు…నిజమే పవన్ గాని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే పవన్ ఒంటరిగా పోటీ చేయడం…లేదా బీజేపీతో కలిసి పోటీ చేసిన సరే వైసీపీకే ప్లస్.
కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ గాని టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణాలో జనసేనకు బలం ఎక్కువ ఉంది. ఆ పార్టీ గాని టీడీపీతో కలిస్తే ఈ మూడు జిల్లాల్లో వైసీపీకి నష్టం..అదే టీడీపీతో కలవకపోతే వైసీపీకి బెనిఫిట్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు.