కిషన్ రేడ్డికి మరో ఛాలెంజ్…. జమ్మూకాశ్మీర్ కి ఎన్నికల ఇంచార్జ్ మనోడే

-

ఇటీవల కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత గంగాపురం కిషన్ రెడ్డికి కీలక శాఖ దక్కింది.బొగ్గు గనుల శాఖ ను కేంద్రం ఆయనకు కేటాయించింది. ఈ శాఖతో తెలుగు రాష్ట్రాలకు లాభం ఏముంటుంది అనే అనుకున్నారు అంతా… కానీ జాతీయ రాజకీయాల్లో కిషన్ రెడ్డి సేవలను వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది.త్వరలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ బీజేపీ అగ్రనాయకత్వం కిషన్ రెడ్డిని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ గా నియమించింది.తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలిపించిన ఘనత ఆయనది.జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఇప్పుడు కిషన్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించి భారీ ప్లాన్ వేసింది.అక్కడ సానుకూల ఫలితాలు సాధించాలని ఆయనకు ఛాలెంజ్ ని ఇచ్చింది హైకమాండ్.

ఒక్కో మంత్రికి ఒక్కో రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన బీజేపీ కీలకమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికల ఇంచార్జ్‌గా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి లద్దాఖ్ ప్రాంతాన్ని వేరు చేసిన విషయం తెలిసిందే. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, మిగతా జమ్ము-కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది.

పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ (POK)లో కూడా కొన్ని నియోజకవర్గాలను ప్రకటిస్తూ అసెంబ్లీని పునర్వ్యవస్థీకరించింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత అల్లకల్లోలంగా మారిన ఆ రాష్ట్రంలో మెల్లమెల్లగా శాంతి నెలకొంది. అభివృద్ధి పట్టాలెక్కగా పర్యాటకం కూడా ఊపందుకుంది. ఈ మార్పులు అక్కడి ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంచాయి.

జమ్మూకాశ్మీర్ లో హిందూ, సిక్కు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారానికి సమస్య పెద్దగా లేకపోయినా, అత్యధిక శాతం ముస్లిం జనాభా కల్గిన కాశ్మీర్ లోయ ఆ పార్టీకి సవాళ్లు విసురుతోంది. ఆ పార్టీ తరఫు ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారిని ఉగ్రవాదులు వెంటాడుతుండగా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం బీజేపీకి సవాలుగా మారింది. అలాంటి రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది.

గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి, ఈ రాష్ట్రంపై గట్టి పట్టు సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలు అమలు చేశారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతల్ని ఆయనకు అప్పగించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కిషన్ రెడ్డికి బీజేపీ పెద్ద టాస్క్ నే ఇచ్చిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version