హైకోర్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షాక్ ఎదుర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించాలి అని తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్ట్ తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఆయనను ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా కొనసాగించాలి అని తీర్పులో స్పష్టం చేసింది. ఇప్పుడు ఏపీ సర్కార్ కి ఈ మధ్య కాలంలో తగిలిన అతి పెద్ద షాక్ గా దీనిని చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు.
రాష్ట్ర పంచాయతీరాజ్ -గ్రామీణాభివృద్ధి శాఖ గత నెల 10న జారీ చేసిన 617, 618, 619 జీవోలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో పాటు మొత్తం 13 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా వాటిపై విచారణ జరిపిన హైకోర్ట్ నేడు ఈ తీర్పు ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఏపీ సర్కార్ రమేష్ కుమార్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనను కొనసాగించాలి అని హైకోర్ట్ చెప్పింది. జీవోలు అన్నీ కూడా కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే ఈ తీర్పుని ముందే ఏపీ సర్కార్ పెద్దలు ఊహించారని ఇప్పుడు ఏపీ సర్కార్ హైకోర్ట్ కి వెళ్ళడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇక ఏపీ సర్కార్ కూడా సీనియర్ లాయర్లతో చర్చలు జరుపుతుంది. తీర్పు కాపీలు తమకు అందిన తర్వాత దీనిపై సుప్రీం కోర్ట్ కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే జగన్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ కి వెళ్ళే విషయంలో వెనకడుగు వేయవచ్చు అని అంటున్నారు. రంగుల విషయంలోనే మేము జోక్యం చేసుకోలేము అని చెప్పిన హైకోర్ట్.. ఇప్పుడు దీనిపై ఏ తీర్పు ఇచ్చినా అది ప్రభుత్వానికే ఇబ్బంది. అందుకే జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది.