ఆ ముగ్గురూ టీడీపీ నుంచి వెళ్తున్నారా…? బాబు హ్యాపీనే…?

-

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతల పెత్తనం కాస్త ఎక్కువైంది అనే అభిప్రాయం గత కొంత కాలంగా మీడియా వర్గాల్లో వినబడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతి అంశంలో తలదూర్చడం పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలి అంటూ కోరడం చంద్రబాబునాయుడు తీసుకునే ప్రతి నిర్ణయంను కూడా ఏదో ఒక విధంగా తప్పు పట్టడం వంటి సీనియర్ నేతలు చేస్తూ వస్తున్నారు.

దీని కారణంగా పార్టీ ఎక్కువగా నష్టపోతుందనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు అగ్రనేతలు విషయంలో ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ వర్గ విభేదాలను పరిష్కరించే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. వాస్తవానికి ఈ వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీకి కాస్త మంచి చేస్తున్నాయనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో ముగ్గురు కీలక నేతలు ఎప్పుడూ కూడా మీడియా సమావేశాల్లో ఎక్కువగా కనబడుతుంటారు. ఈ ముగ్గురు నేతలు కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానం తీరుపై కాస్త సీరియస్ గా ఉన్నారట. తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఇప్పుడు ఎక్కువగా తమను పక్కన పెడుతున్నారని… ముందు నుంచి మేమున్నా… ప్రభుత్వంలో మా వంతు కృషి చేసిన చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తో విభేదించి వాళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు అంట.

నిజంగా వాళ్ళు అనుకున్న విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు బయటికి వెళ్లిపోతే తెలుగుదేశం పార్టీకి చాలా మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే భావనతో చంద్రబాబు నాయుడు చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండే వాళ్ళు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు నాయుడికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం దొరికింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version