అసహ్యం వేస్తుంది… అఖిలప్రియపై ఏవీ జస్వంతి షాకింగ్ కామెంట్స్!

-

ప్రస్తుతం సీమ రాజకీయాల్లో అఖిలప్రియ – ఏవీ సుబ్బారెడ్డిల వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. గంట గంటకీ అఖిలప్రియ వ్యవహారంపై ఏవీ సుబ్బారెడ్డి వైపు నుంచి విమర్శల దాడి పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డలో అఖిలప్రియపై తాను పోటీకి సిద్ధమని ప్రకటించేసింది.

ఏవీ సుబ్బారెడ్డి – అఖిల ప్రియల వ్యవహారంపై జస్వంతి స్పందించరు. తమది ఆళ్ళగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని.. ఆళ్ళగడ్డలో అఖిలప్రియపై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా మరింత వేడి పెంచిన జస్వంతి… అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందని.. దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోనని, ఆడపిల్లగా నాన్న లేని పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదని… నిజంగా భూమా దంపతులు, ఏవీ సుబ్బారెడ్డిల 30ఏళ్ళ కష్ట ఫలితమే నేడు అఖిలప్రియఅనుభవిస్తున్న స్థాయి అని ఆమె దుయ్యబట్టారు. ఇంకా డోస్ పెంచిన జస్వంతి… అఖిలప్రియ ది క్రిమినల్ మైండ్ అని, ఆమె తీరు మహిళలకే సిగ్గుచేటని ఫైరయ్యారు!

అనంతరం ఇదే విషయంపై స్పందించిన సుబ్బారెడ్డి… అఖిలప్రియతో రాజీపడేది లేదని స్పష్టం చేశారు! “‘నాకు భయం లేదు… నన్ను నేను కాపాడుకోగలను. 35 ఏళ్లుగా ఫ్యాక్షన్‌ ఫీల్డ్‌లో ఉన్నా. ఫ్యాక్షన్‌ ను వదిలేశాను కాబట్టే ఒంటరిగా తిరుగుతున్నా. ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తా” అని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version