జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం..

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. జియోకు చెందిన జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడే వారు ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు ఏడాదికి రూ.999 అవుతుంది. దీంతో ఆ మేర డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చు.

కాగా జియో ఫైబ‌ర్‌లో క్వార్ట‌ర్లీ, హాఫ్ ఇయ‌ర్లీ, ఇయ‌ర్లీ ప్లాన్లు తీసుకున్న వారికే ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది. దీన్ని పొందాలంటే క‌స్ట‌మ‌ర్లు మై జియో యాప్‌కు వెళ్లి రిడీమ్ చేసుకోవాలి. ఇక ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న‌వారు ఈ ఆఫ‌ర్‌ను పొంద‌లేరు. వారి అమెజాన్ స‌బ్‌స్క్రిప్ష‌న్ గ‌డువు ముగిశాక ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక రిల‌య‌న్స్ జియో త‌న మొబైల్ క‌స్ట‌మ‌ర్ల‌కు త్వ‌ర‌లోనే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా అందివ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆ ఆఫ‌ర్‌ను జియో ఎప్పుడు అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version