చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ వల్ల చాలా దేశాల్లో షట్ డౌన్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు ఈ వైరస్ ని ఎదుర్కొనలేక చేతులెత్తిస్తున్నాయి. ఈ వైరస్ దెబ్బకి ఇటలీ మరియు స్పెయిన్ దేశాలలో అనేక మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆర్థికంగా అన్ని విధాలా ఇలాంటి దేశం అయినా మట్టికరిపించి కలిగిన దేశంగా పేరొందిన అమెరికా ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో అమెరికన్లకు భారీ ప్యాకేజీ కూడా ప్రకటించారు. కానీ షట్ డౌన్ చేసే ఛాన్స్ లేదని డోనాల్డ్ ట్రంప్ తెగేసి చెపుతున్నారు. దీంతో ట్రంపు వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క అమెరికా దేశంలో వైరస్ విలయతాండవం చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపం అమెరికా అనే మాట మూడు వందల సంవత్సరాల తరవాత వినబడుతుంది. 1776 లో అమెరికా కి స్వతంత్రం లేదు అప్పట్లో అనేవారు మల్లీ ఇన్నాళ్ళకి ఈ మాట వినబడింది. నిన్న మొన్నటి వరకు అగ్రరాజ్యంగా వెలుగొందిన అమెరికా ఈ స్థితికి చేరడంతో చాలా మంది అమెరికా భవిష్యత్తు ఏమైపోతుందో అని బాధ పడుతున్నారు.