బండికి హ్యాట్రిక్ టెన్షన్.. గంగులని ఈ సారైనా నిలువరిస్తారా?

-

రాజకీయాల్లో ఎక్కడైనా హ్యాట్రిక్ విజయం అనేది చాలా గొప్పగా ఉంటుంది..కానీ పరాజయాలు అనేది చాలా ఇబ్బంది. ఒకసారి ఓడితేనే నాయకులకు చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా హ్యాట్రిక్ ఓటమి అనేది పెద్ద దెబ్బ. అయితే ఆ ఓటమి రాకుండా ఉండాలని చెప్పి బి‌జే‌పి ఎంపీ బండి సంజయ్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. బండి సంజయ్..గత రెండు ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నారు.

2014, 2018 ఎన్నికల్లో బి‌జే‌పి తరుపున పోటీ చేసి..మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే వెంటనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తాను ఎక్కడైతే ఓడిపోయారో…కరీంనగర్ అసెంబ్లీలో ఆధిక్యం సాధించారు. ఆ తర్వాత బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడుగా దూకుడుగా రాజకీయం చేశారు. ఇప్పుడు అధ్యక్ష పదవి పోయింది. దీంతో ఆయన తన స్థానం కరీంనగర్ పై ఫోకస్ పెట్టారు.

రానున్న ఎన్నికల్లో బండి మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కుదరకపోతే వేములవాడ స్థానానికి మారే ఛాన్స్ ఉంది. కానీ దాదాపు కరీంనగర్ లోనే బరిలో దిగుతారని తెలుస్తుంది. మరి అక్కడ పోటీ చేస్తే బండి గెలవగలరా? అంటే గెలుపు అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎందుకంటే అపోజిట్ లో బలమైన గంగుల కమలాకర్ ఉన్నారు. పైగా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన్ని నిలువరించడం ఈజీ కాదు. అటు కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరినీ దాటుకుని బండి విజయం అనేది కాస్త కష్టమైన టాస్క్.

కాకపోతే 2018లో బండి పరిస్తితి వేరు..ఇప్పుడు వేరు..ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. బలమైన లీడర్ గా ఎదిగారు. కాబట్టి బండి గట్టిగా కష్టపడితే కరీంనగర్ లో హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకునే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version