బండికి ఫుల్ పవర్స్..కోర్ కమిటీలో కీలక వ్యూహాలు..కారుకు చెక్.!

-

ఊహించని విధంగా టెన్త్ క్లాస్ పేపర్ల లీకు కేసులో బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. వరుసగా పేపర్ల లీకేజ్ లో కే‌సిఆర్ సర్కారుని ఇరుకున పెట్టేలా పోరాటం చేస్తున్న బి‌జే‌పికి ఊహించని విధంగా రివర్స్ అయింది. బండి కావాలని తెలిసిన టీచర్ల ద్వారా పేపర్లు లీక్ చేయించి, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూసారని అందుకే బండిని అరెస్ట్ చేశారని బి‌ఆర్‌ఎస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తూ వచ్చారు.

అయితే ఇదంతా బి‌ఆర్‌ఎస్ కుట్ర అని బి‌జే‌పి నేతలు అంటున్నారు. ఈ క్రమ్మలోనే బెయిల్ పై బండి విడుదల అయ్యారు. అలాగే ఆయనకు బి‌జే‌పి నేతలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అటు కేంద్రం నేతలు కూడా మద్ధతు పలికి ఇంకా దూకుడుగా వెళ్లాలని సూచించారు.  బండి సంజయ్‌కి కేంద్రమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇంకా పలువురు జాతీయ నేతలు బండి.. ‘గో ఎహెడ్‌’.. హైకమాండ్‌ మీకు అండగా ఉందని, ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని హైకమాండ్‌ ఆదేశించిందని తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ  కుట్రలను చెదిద్ధామని చెప్పినట్లు సమాచారం.

ఇదే సమయంలో శనివారం హైదరాబాద్ కు మోదీ రానున్నారు..ఈ క్రమంలో తాజాగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బి‌జే‌పి కోర్ కమిటీ సమావేశం జరిగింది. బండి సంజయ్ అరెస్ట్, ఆయన జైలుకు తరలింపు, బండి సంజయ్ బెయిల్, తదనంతర పరిణామాలను గురించి సీరియస్ గా కోర్ కమిటీ మీటింగ్ లో చర్చించారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ రాక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.  ఇక బి‌ఆర్‌ఎస్ వ్యూహాన్ని తిప్పికొట్టాలని బి‌జే‌పి నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని గతంలో రామగుండంలో పర్యటించిన సందర్భంలో బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని చెప్పారని, మళ్లీ అదే విషయాన్ని ప్రస్తుతం కూడా గట్టిగా చెప్పి బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version