భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు అజద్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయంలో తన భార్యపై చేయి చేసుకొని పదవి పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆజాద్ సింగ్ బిజెపి పార్టీ మెహ్రౌలీ జిల్లా చీఫ్ కాగా, అతని భార్య సరితా చౌదరి దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్. అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ బిజెపి ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ నాయకుడు ప్రకాష్ జవదేకర్‌తో గురువారం సమావేశం జరిగింది.
అయితే ఈ సమావేశం తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. అందరి ముందు ఆమె ను దారుణంగా ఈడ్చుకువెళ్లి కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆజాద్ సింగ్ ను తొలగిస్తూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చర్యలు తీసుకున్నారు. మెహరౌలి బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడిగా మరో బీజేపీ నాయకుడు వికాస్ తన్వర్ ను నియమించారు. వాస్తవానికి అజద్ సింగ్ మరియు అతని భార్య సరితా చౌదరిల మధ్య ఎప్పటి నుంచో వైవాహిక వివాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఆజాద్ సింగ్ తన భార్య నుండి విడాకుల కోసం దాఖలు చేసినట్లు సమాచారం. కానీ ఇప్పుడు వీళ్లు బహిరంగంగానే పోట్లాడుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే అజాద్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ నా భార్యే నన్ను తిడుతూ గొడవ ప్రారంభించింది. నన్ను తోసేందుకు ప్రయత్నించింది. ఆమె నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి చేయి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు రాలేదని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ దీనిపై ఏదైనా ఫిర్యాదు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
.@BJP4Delhi leader Azad singh slaps his wife inside Delhi BJP HQ, complaint registered. @ManojTiwariMP @RSSorg @geetv79 @priyankagandhi pic.twitter.com/wM3mou3PmC
— Simran Kaur (@simran100kaur1) September 19, 2019