ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ ఎంపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు ఆహ్వానం

-

నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అర్వింద్ రాష్ర్ట రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్ కు మింగుడు పడని ఆంశం. స్వయంగా కేసీఆర్ కూతురు కవితను ఎంపీ ఎన్నికల్లో ఓడించి గెలిచిన ఈ బీజేపీ అభ్యర్థి గెలిచిన తర్వాత కూడా… విమర్శలతో ముందుకు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అవసరమైన పసుపు బోర్డు హామీని నెరవేరుస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈయన సీఎం కూతురును ఓడించడం గమనార్హం. తాజాగా విషయమేంటంటే… నిజామాబాద్ లో పూర్తి కాకుండా ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ఆయన తాజాగా ఓ నిరసన కార్యక్రమాన్ని ప్లాన్ చేశాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా… ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా.. ఆహ్వానించాడు. ప్రజా శ్రేయస్సు కొరకు రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలకతీతంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారిని అభ్యర్థించాడు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా రాష్ర్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారట. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా.. హాజరయి పోరాడితే అధికార టీఆర్ఎస్ పై ప్రజల్లో ఇంకా ఎక్కువ వ్యతిరేఖత వస్తుందనేది బీజేపీ ప్లాన్.

బీజేపీ ప్లాన్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారట. ఒక వేళ నిరసన కార్యక్రమానికి హాజరయితే… అధిష్టానం సీరియస్ అవుతుందని… అలా అని సైలెంట్ గా ఉంటే ప్రజల్లో వ్యతిరేఖత వస్తుందని మదన పడుతున్నారట. బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిసి.. టీఆర్ఎస్ నాయకులు ఏం చేయాలో పాలు పోని స్థితిలో పడ్డారు. మరి ఈ మీటింగ్ కు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజి రెడ్డి గోవర్ధన్ లు హాజరవుతారో లేదో వేచి చూడాలి…

Read more RELATED
Recommended to you

Exit mobile version