కేసీఆర్ సెన్సేషన్..ఆ ఎమ్మెల్యేకు సీటు నో..రాసిపెట్టుకోవచ్చు..!

-

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కే‌సి‌ఆర్ మళ్ళీ సత్తా చాటే విధంగా ముందుకెళుతున్నారు. మరొకసారి ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే అధికారం సొంతం చేసుకోవాలంటే ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమే కాదు..సొంత పార్టీలోని కొన్ని తప్పులని సరి చేయాల్సిన అవసరం కూడా ఉంది.

ఇప్పుడు ఆ దిశగానే కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో కే‌సి‌ఆర్ ఈ సరి కఠినంగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు చేసిన సర్వేల్లో కొంతమంది ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని తెలిసింది. కాకపోతే ఎన్నికలకు సమయం ఉండటంతో వారి పని తీరు మెరుగు పర్చుకునేందుకు ఇంకా సమయం ఇచ్చారు. కానీ ఆ లోపు కూడా సరిచేసుకోకపోతే వారికి డౌట్ లేకుండా సీట్లు ఇవ్వరు. ఎలా చూసుకున్న ఎన్నికల నాటికి బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఉన్న 104 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుంటుందని అనుకోవడానికి లేదు.

అలాగే 104 మందికి కే‌సి‌ఆర్ సీటు ఇవ్వడం కష్టం..అందులో 10 శాతం మందినైనా పక్కన పెట్టాల్సిందే. గత ఎన్నికల్లో అన్నీ బాగునప్పుడే 7 మంది ఎమ్మెల్యేలని సైడ్ చేశారు. ఈ సారి మాత్రం కాస్త ఎక్కువమందినే సైడ్ చేస్తారని తెలిసింది. ఇదే క్రమంలో సీటు ఇచ్చే విషయంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నారట.

ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలని సైడ్ చేయడం మాత్రం గ్యారెంటీ అని ప్రచారం వస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే బి‌ఆర్‌ఎస్ 1 సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ 4, టి‌డి‌పి 2, ఒక ఇండిపెండెంట్ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో 8 మందికి బలం చేరింది. అందులో డౌట్ లేకుండా ఒక ఎమ్మెల్యేకు మాత్రం సీటు ఇవ్వడం లేదని తెలిసింది. ఆ ఎమ్మెల్యే ఎవరో ఎన్నికల ముందే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version