సీతక్కకు చెక్..ములుగుపై నజర్..సాధ్యమేనా?

-

రాజకీయాల్లో పెద్దగా శత్రువులు లేని నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రమే అని చెప్పాలి. రాజకీయంగా ఏ పార్టీ వారైనా సరే సీతక్క పనితీరుని మెచ్చుకోవాల్సిందే. ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఎలా అండగా ఉండాలో..ఎలా సేవ చేయాలో సీతక్కని చూసి నేర్చుకోవచ్చు. కరోనా సమయంలో ఆమె ప్రజలకు అండగా ఉన్న తీరు అందరినీ కదిలించింది. అలా చేయడం వల్లే ములుగులో ఆమె రాజకీయంగా బలపడిపోయారు.

రాష్ట్రంలో గాలి ఎటు ఉన్న ములుగులో మాత్రం సీతక్క వైపే ఉంటుందనే పరిస్తితి. ఇపుడు అలాంటి చోట బి‌ఆర్‌ఎస్ రాజకీయం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆమెని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ములుగుని టార్గెట్ చేసుకుని తాజాగా అక్కడ పలు అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రులు కే‌టి‌ఆర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ లాంటి వారు ములుగుకు వచ్చి..అక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీని పైకి లేపే ప్రయత్నాలు చేశారు.

133 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పక్షపాతం చూపకుండా అభివృద్ధి చేస్తున్నామని, పార్టీ అభ్యర్ధి ఓడిపోయినా ములుగును జిల్లాగా ఏర్పాటుచేశామని,  స్థానిక ఎమ్మెల్యే దరఖాస్తు కూడా ఇవ్వక ముందే మెడికల్‌ కళాశాలను మంజూరు చేశామని కే‌టి‌ఆర్ తెలిపారు. ములుగులో 33వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి జిల్లా ఇచ్చిన కేసీఆర్‌ రుణం తీర్చుకుంటామని ఎర్రబెల్లి ప్రకటించారు.

అంటే దీంతో ములుగులో బి‌ఆర్‌ఎస్ టార్గెట్ ఏంటి అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడ సీతక్కని ఓడించడమే బి‌ఆర్‌ఎస్ లక్ష్యం. మరి అది సాధ్యమవుతుందా? అంటే చెప్పలేని పరిస్తితి. అక్కడ సీతక్క స్ట్రాంగ్ గా ఉన్నారు..ఇటు బి‌ఆర్‌ఎస్ పార్టీ కూడా బలంగానే ఉంది. కానీ అభ్యర్ధి విషయంలో క్లారిటీ లేదు. అభ్యర్ధి బట్టి రాజకీయ సమీకరాణాలు మారే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సారి సీతక్కని నిలువరించగలరో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version