ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి..ఓ వైపు టీడీపీ వరేశ్ వైసీపీ అన్నట్లు పోరు నడుస్తూనే ఉంది. మరో వైపు పవన్ వర్సెస్ వైసీపీ కాపు నేతలు అన్నట్లు రచ్చ నడుస్తుంది. వారాహి యాత్ర చేస్తున్న పవన్ పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు.
ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం..ద్వారంపూడికి మద్ధతు ఇస్తూ..పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇటు జనసేన శ్రేణులు ముద్రగడపై ఫైర్ అవుతున్నారు. దీంతో మళ్ళీ ముద్రగడ..పవన్ కు లేఖ రాసి..ఫ్యాన్స్ తో తిట్టించడం కాదు..దమ్ముంటే పవనే తనని తిట్టాలని అన్నారు. అలాగే కాకినాడ పోటీ చేయాలి లేదా పిఠాపురం లో పోటీ చేసి..తనని పోటీకి ఆహ్వానించాలని అన్నారు. ఇక వైసీపీలో చేరి..పిఠాపురంలో పోటీ చేయబోతున్న ముద్రగడ..పవన్ పై విరుచుకుపడి కాపు ఓట్లు పూర్తిగా జనసేనకు వెళ్లకుండా చూసుకునేలా ప్రయత్నిస్తున్నారు.
ఇక పవన్‌పై విమర్శలు చేసే క్రమంలో తాజాగా చంద్రబాబుని లాగారు. 1988లో వంగవీటి రంగాని హత్య చేసిన తరువాత ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టినప్పుడు ఎప్పుడైనా తమరు వెళ్ళి చూసారా? అని పవన్‌ని ప్రశ్నించిన ముద్రగడ.. గతంలో సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుని కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయమని కోరారని అడిగారు.
ఇక బాబు పేరు తీయడంతో టిడిపి నేత బుద్దా వెంకన్న..ముద్రగడకు కౌంటర్ లేఖ రాశారు. ‘‘ముద్రగడ గారూ మీది పొరబాటా లేక గ్రహపాటా. 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారిని 1993-94లో ఎలా కలుస్తారు. ఈ లేఖ మీరు రాసిందా లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా. 1993-94 లో పత్తిపాడు ఎమ్మెల్యేగా మీరు, ముఖ్యమంత్రిగా కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు ఉన్నారు. మీరు చెబుతున్న కేసులు అప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులే అని మరచిపోయారా. అప్పుడు విషయం చంద్రబాబుకు ఆపాదించడం పొరబాటు కాదా” అని ముద్రగడపై బుద్దా ఫైర్ అయ్యారు.