బుగ్గన ఛాలెంజ్ మాములుగా లేదు… కన్నా వాట్ నెక్స్ట్?

-

రాజకీయాల్లో విమర్శలూ ప్రతివిమర్శలూ అత్యంత సహజం ఎలాగో… అలాగే సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా సహజమే! కానీ… కొన్ని విమర్శలు, మరికొన్ని సవాళ్లు మాత్రం మాంచి రసవత్తరంగా ఉంటాయి. అందులో కొన్ని చాలా నిజాయితీగా కూడా ఉంటాయి! అలాంటి ఒక సవాల్ తాజాగా ఏపీ రాజకీయాల్లో జరిగింది. అది ఎవరెవరి మధ్యనయ్యా అంటే… ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి – ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణకు మధ్య! అవును… ఆరోపణలు చేసి అనంతరం పారిపోయే పరిస్థితి కన్నాకు రావొద్దనో ఏమో కానీ… కన్నాకు అద్భుతమైన అవకాశం కల్పించారు బుగ్గన!

అవును… కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు కొనుగోలు చేసిన కంపెనీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డైరెక్టర్‌ అని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు కన్నా కట్టుబడి ఉండి, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, అలా నిరూపిస్తే రేపు (శనివారం) ఉదయం 9 గంటలకే రాజినామా చేస్తానని సవాల్ విసిరారు బుగ్గన! ఈ రేంజ్ సవాల్ ఈ మధ్యకాలంలో చూడలేదని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ సంగతి కాసేపు పక్కనపెడితే… దీనిపై కన్నా లక్ష్మీ నారాయణ ఇంకా స్పందించాల్సి ఉంది! అసలు ఇలాంటి సవాల్ కు కన్నా నిజంగా స్పందిస్తారా… లేక తనవి చవకబారు ఆరోపణలు అని ఒప్పుకుంటూ తేలు కుట్టిన దొంగలా బయటకు రాకుండా ఉంటారా అనేది వేచి చూడాలి.

కాగా… కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున వెచ్చించి తొలుత లక్ష కిట్లను దిగుమతి చేసుకున్న సర్కారు.. రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రత్యేకమైన క్లాజ్‌ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది. ఈ క్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ సహా పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Exit mobile version