వలస కార్మికుల విషయంలో ముందు నుంచి కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరగడం లాక్ డౌన్ మినహా మరో మార్గం లేకపోవడం రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోవడం అన్నీ కూడా సమస్యగా మారాయి. అయినా సరే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని తెలంగాణా అభివృద్దిలో మీ పాత్ర చాలా కీలకం అని భావించి వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
వాళ్లకు రాష్ట్ర ప్రజలతో పాటుగా 1500 ఇచ్చారు కేసీఆర్. అదే విధంగా సొంత ఊర్లకు వెళ్ళిపోయే వాళ్లకు ప్రతీ ఎమ్మెల్యే ప్రతీ మంత్రి కూడా అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళను వెళ్ళవద్దని తాము ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇక లాక్ డౌన్ పెంచే అవకాశాలు కనపడటం మే 3 దగ్గర పడటంతో వలస కూలీలను భారీగా బస్సుల్లో సొంత రాష్ట్రాలకు తరలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. వేగంగా కేంద్రంతో చర్చలు జరిపారు.
వెంటనే కేంద్రం కూడా సానుకూల౦గా స్పందించడం తొలి రైలు తెలంగాణా నుంచి ఝార్ఖండ్ కి పెట్టడం జరిగింది. ఎవరూ కూడా ఇక్కడ పస్తులు ఉండవద్దు అని వాళ్లకు అండగా ఉన్న కేసీఆర్ వాళ్ళు రాష్ట్రం నుంచి సొంత ఊర్లకు వెళ్ళడానికి కూడా తన వంతు సహకారం అందించారు. అన్ని జిల్లాలకు చెందిన వారిని రైల్లోనే పంపాలి అని భావించారు. ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది.