బైరెడ్డి ఎఫెక్ట్…ఆర్థర్‌కు హ్యాండేనా!

-

గత రెండు ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధులని మార్చుకుంటూ వస్తూ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా అభ్యర్ధిని మార్చడానికి జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సీటు ఎవరికి ఇస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే 2014లో వైసీపీ తరుపున నందికొట్కూరులో ఐజయ్య గెలిచారు. ఇక ఈయన పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల 2019 ఎన్నికల్లో ఈయనని పక్కన పెట్టేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.

దీంతో ముందుగానే సీటు దక్కదని హింట్ ఇచ్చేశారు. దీంతో ఐజయ్య అనుహ్యాంగా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇక వైసీపీ తరుపున ఆర్థర్‌కు సీటు ఇచ్చారు. కానీ టీడీపీలోకి వచ్చినా సరే ఐజయ్యకు సీటు దక్కలేదు. టీడీపీ తరుపున బండి జయరాజు పోటీ చేశారు. ఇక టీడీపీకి మద్ధతుగా ఐజయ్య, అలాగే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిలబడ్డారు. అటు వైసీపీకి మద్ధతుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నిలబడ్డారు.

ఇక జగన్ వేవ్, బైరెడ్డి ఇమేజ్‌తో ఆర్థర్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ఆర్థర్, బైరెడ్డిలకు పొసగడం లేదు..ఇప్పటికీ ఆ రెండు వర్గాల మధ్య ఏదొక రచ్చ జరుతుతూనే ఉంది. దీంతో విసుగు చెందిన ఆర్థర్ నెక్స్ట్…తాను రాజకీయాల్లో ఉండనని ముందే ప్రకటించేశారు. మరి నెక్స్ట్ ఆయన మళ్ళీ సీటు ఆశిస్తున్నారో లేదో క్లారిటీ లేదు. కానీ ఆయనని మార్చి…వేరే లీడర్‌ని నందికొట్కూరు బరిలో పెట్టడం ఖాయమని తెలుస్తోంది.

అది కూడా బైరెడ్డి సిద్ధార్థ్ మద్ధతు ఉన్న నేతనే నందికొట్కూరు బరిలో నిలబెడతారని తెలుస్తోంది…కానీ ఈ విషయంలో ఇప్పుడే జగన్ క్లారిటీ ఇచ్చేలా లేరు. ఎన్నికల ముందే నందికొట్కూరులో కొత్త అభ్యర్ధి ఎవరో ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే నెక్స్ట్ నందికొట్కూరులో మరో కొత్త అభ్యర్ధి బరిలో దిగేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version