అచ్చెన్నకు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్న బాబు… వ్యూహం స్టార్ట్!

-

ఎవరికోసం ఏదీ ఆగదు.. ఏ ఒక్కరికోసమో ఏదీ మారదు.. అలాగే అచ్చెన్నాయుడు అరెస్టయ్యారనో, బయటపడటం కష్టమనో బాబుకు తెలిసిందో ఏమో కానీ… ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆల్టర్ నేటివ్ ఆప్షన్ దిశగా బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!

బీసీలకు పెద్దపీట వేసే క్రమంలో అని చెప్పి అచ్చెన్నను బాగా ప్రోత్సహించారు చంద్రబాబు. కొల్లు రవీంద్రను కూడా ఆ సామాజికవర్గాన్ని మరింత దగ్గరగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా దగ్గర చేసుకున్నారు! ఈ క్రమంలో వీరిద్దరూ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేసరికి… వారు బయటకి రావడంపై క్లార్టీ వచ్చిందో ఏమో కానీ… ఆ ప్లేస్ ను ఫిల్ చేయించడానికన్నట్లుగా బీసీ సామాజికవర్గానికి చెందిన ఒక నేతను బాబు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు!

అవును… విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ ను చంద్రబాబు.. అచ్చెన్నాయుడిని ప్రోత్సహించిన రేంజ్ లో ప్రోత్సహించబోతున్నారంట. అచ్చెన్న అరెస్టు, కొల్లు రవీంద్ర అరెస్టులతో డీలా పడిపోయిన బాబుకు… మూలిగేనక్కపైన తాటికాయ పడ్డట్లుగా జగన్… సిదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు! ఫలితంగా మత్సకార సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లుగా బెంగపడిన బాబు… అదే సామాజికవర్గానికి చెందిన గణేష్ పై శ్రద్ధ పెడుతున్నారని అంటున్నారు!

ఇదే క్రమంలో విశాఖలో వాసుపల్లి గణేష్ కూడా పార్టీకి చాలా లయాలిటీగా ఉంటున్నారని… తన సొంత ఖర్చుతోనే పార్టీని నిలబెట్టేపనులకు పూనుకుంటున్నారని తెలియడంతో… రాజధాని ప్రాంతంలో పూర్తి బాధ్యతలు గణేష్ కి అప్పగించబోతున్నారంట బాబు!

అందులో భాగంగానే అప్పుడే అమరావతి, వైజాగ్ ల గురించి ఏమీ మాట్లాడవద్దని… రేపు రాజధానిలో టీడీపీ తరుపున రాజకీయాలు చేయాల్సిందే తమరే అని బాబు.. గనేష్ కి చెప్పారని అంటున్నారు! అదే జరిగితే మాత్రం… అచ్చెన్న ప్లేస్ ని వాసుపల్లి గణేష్ ఆక్యుపై చేసినట్లే.. అచ్చెన్నకు ఆల్టర్నేటివ్ గా బాబుకు గణేష్ దొరికినట్లేనని అంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version