వెనుకబడిన వర్గాల పార్టీ అని తెలుగుదేశానికి పేరుంది.ఇది సీనియర్ ఎన్టీయార్ ఉన్నప్పటి మాట.పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన చేతిలో పార్టీ ఉన్నంతకాలం బీసీలకు,నిమ్న కులాల నాయకులకు,చివరికి పేద వాళ్ళకు సైతం చట్ట సభలకు ఎన్నికయ్యేలా అగ్రప్రధాన్యం ఇచ్చారు.మరుగున పడిపోయి ఉన్న బీసీలను తీసుకువచ్చి రాజ్యాధికారం కల్పించిన ఘనత ఆయనది.అందుకే ఆయన బీసీల పట్ల దేవుడయ్యారు.టీ
డీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడడమే కాకుండా ఆ వర్గాల నుంచి అదే స్థాయిలో మద్దతు కూడా దక్కేది.అయితే చంద్రబాబు వచ్చాక బీసీలు దగా పడ్డారు.వెనుకబడిన వర్గాలు వెనుకే ఉండాలి అనేలా చంద్రబాబు వ్యవహరించారు.డబ్బున్న పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు,అగ్ర వర్ణాల వారికి మాత్రమే ఇప్పుడు టీడీపీ ఆలవాలమైంది.
చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చాక బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.కేవలం వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ప్రాధాన్యం లేని వర్గంగా చంద్రబాబు ట్రీట్ చేశారు.దీంతో డబ్బులేని వాళ్ళు,కింది స్థాయి వాళ్ళు మెల్లగా పార్టీ నుంచి కనుమరుగైపోయారు.బీసీలు అంటే వర్ణ వ్యవస్థలో కింది కులాల వాళ్ళు కాబట్టి వారిని కిందనే ఉంచాలన్నది చంద్రబాబు తత్వం. వారికి అవకాశాలు ఇవ్వరాదని,రాను రాను వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలన్నది ఆయన విధానంగా మారింది.ఓ వైపు బీసీల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా లెక్కచేయకుండా తన విధానంలోనే ముందుకెళుతున్నారు.ఈ విధానంపై బీసీలు తీవ్రంగా మండిపడుతున్నారు.
శనివారం నాడు తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల చేసారు.ఈ తాజా జాబితాలోనూ చంద్రబాబు బీసీల పట్ల వివక్ష చూపించారు.ఏపీలో 45 % జనాభా ఉన్న బీసీలకు 18 సీట్లే ఇచ్చారు.మైనారిటీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చి ఊరుకున్నారు.4% జనాభా ఉన్న కమ్మలకు మాత్రం 21 సీట్లు ఇచ్చారు.గతంలో బీసీల తోకలు కట్ చేస్తానన్న బాబు నేడు ఆ మాటను నిజం చేశారని ఈ జాబితా చూసిన బీసీలు మండిపడుతున్నారు.దీంతో చంద్రబాబుపై రగిలిపోతున్న బీసీలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.రానున్న ఎన్నికల్లో ఓటు పవర్ ఏమిటో చంద్రబాబు కి చూపిస్తామని బీసీలు పిడికిలి బిగించి రెడీగా కూర్చున్నారు.ఈసారి మాత్రం బాబుకి బడితే పూజ తప్పదని అంటున్నారు.