ఇంజనీరు కావాలంటే బైపీసీ చేయాలంట… పాపం చంద్రబాబు

-

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అక్కసుతోనో లేక వయసు మళ్ళిన ప్రభావమో తెలియదు కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు టీడీపీ సభల్లో ఏమి మాట్లాడుతున్నాడో మిషన్ 2050 అంటూ సభలు నిర్వహించే చంద్రబాబు సభలకు జనాలు కూడా రాలేని పరిస్థితులు వచ్చేశాయి. అయినప్పటికీ ఊకదంపుడు కబుర్లు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. అర్థం కావడం లేదు.

అన్ని నాకే తెలుసు.. అన్ని నేనే చేశా అని అనడం అలవాటు చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రాన్ని వదిలి దేశం గురించి యువత భవిష్యత్తు గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

బీకాం లో ఫిజిక్స్ చదివానని మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన టీడీపీకి చెందిన సీనియర్ నేత జనాల్ని ఎంతలా నవ్వుకునేలా చేసారో తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు కూడా తాను తెలివిమంతుడిని అని తేల్చేశారు. ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలంటూ తన తెలివి తక్కువ తనాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు. ఏ కోర్సు చదివితే ఏమవుతారో తెలియని ఈ మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ఎలా పరిపాలన చేశాడు అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అటు రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు తీరుపై సెటైర్లు పేలుస్తున్నారు. ఐటీని కూడా తానే తెచ్చాను అని చెప్పే చంద్రబాబు ఇలా మాట్లాడటం విడ్డురంగా ఉందంటున్నారు. టీడీపీ అంతిమ యాత్రకు సిద్ధమైపోయిందని చర్చించుకుంటున్నారు.

చంద్రబాబు సభలకు జనాలు రారు అని అర్థమైపోయింది. అందుకే ఈమధ్య నీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఒక యాత్ర చేసిన చంద్రబాబు కేవలం పార్టీ కార్యకర్తలనే పిలిపించుకుని కాస్త హడావుడి చేశాడు. కొంచెం గ్యాప్ తీసుకుని నిర్వహించిన విజనరీ 2047 మీటింగ్ కూడా అట్టర్ ప్లాప్ అయింది. ఈ విజనరీ మీటింగులకు అసలు జనాలు కరువయ్యారు.ఇప్పుడు రాజకీయాలు సైతం యువరక్తంతో నిండిపోయాయి. అది గ్రహించని చంద్రబాబు తాను ఇంకా రాష్ట్రాన్ని పాలిస్తాననే అత్యాసలో ఉన్నట్టున్నాడు అని ప్రజలు తిట్టిపోస్తున్నారు. జనాలు రాకపోయినా ఈ వయసు మళ్ళిన బాబు తాను చెప్పాల్సింది చెప్పుకుంటూ పోతున్నారు.రాజకీయాల్లో 40 సంవత్సారాలు అనుభవం అని చెప్పే చంద్రబాబును ప్రజలు నమ్మట్లేదు కాబట్టే ఇప్పుడు దేశం అభివృద్ధి,జన్మభూమి అంటూ అవుట్ డేటెడ్ కబుర్లు చెప్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాపం ఈ వాస్తవాలను చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన నేతలు ఎప్పుడు గ్రహిస్తారో…

Read more RELATED
Recommended to you

Exit mobile version