టీటీడీ బోర్డు చైర్మన్ గా రోజుకో కొత్త పేరు.. చంద్రబాబు సన్నిహితునికి అవకాశమంటూ ప్రచారం..

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి రాజకీయాలు చెయ్యకూడదు.. దేవుని మీద భక్తి, విశ్వాసం ఉన్న వారికే బోర్డులో అవకాశాలు కల్పించాలి.. ఈ మాటలు వెంకటేశ్వరస్వామిని విశ్వసించేవారు చెప్పే మాటలు.. తిరుపతి నుంచి రాజకీయ పెత్తనాన్ని దూరం చెయ్యాలని ఓ వైపు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు నాయుడు అనుహ్యనిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.. రాజకీయ నేపథ్యంలో లేనివారికి ఈ చైర్మన్ పదవి అప్పగించాలని ఆయన భావిస్తున్నట్లు చంద్రబాబు సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.. ఈవోగా శ్యామలరావు ఉన్న నేపథ్యంలో.. త్వరలోనే చైర్మన్ పదవిని ప్రకటించే అవకాశముందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి..

తిరుమల మహాప్రసాదంలో జంతువుల ప్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ దుమారం రేపుతూనే ఉన్నాయి.. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి.. అవి ఇంకా చల్లారకముందే.. జగన్ తిరుమల పర్యటనను కూటమి నేతలు అడ్డుకున్నారు.. డిక్లరేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.. ఇదే సమయంలో టీటీడీలో రాజకీయ జోక్యం ఉండకూదనే డిమాండ్లు భాగా వినిపిస్తున్నాయి.. బిజేపీ, హిందూ సంఘాలు ఈ తరహా డిమాండ్ ను తెరమీదకు తీసుకొస్తున్నాయి..

వచ్చె నెల నుంచి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో టీటీడీ చైర్మన్ గా రాజకీయంతో సంబంధంలేని వ్యక్తిని నియమించాలని చంద్రబాబుభావిస్తున్నారు.. నిన్నమొన్నటి వరకు ఓ ఛానెల్ అధినేతకు చైర్మన్ యోగం దక్కబోతుందంటూ ప్రచారం జరిగింది.. కానీ గత వారం నుంచి టీడీపీ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. టీటీడీ కొత్త చైర్మన్ గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఈ కీలకమైన ప్రతిష్టాత్మకమైన పదవిలోకి తెస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పరమ భక్తుడు. దేశంలోనే అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తిగా విశేష సేవలు అందించారు.

అందువల్ల ఆయనకు ఆ కీలకమైన పదవిని అప్పగిస్తే అందరి సర్వామోదం ఉంటుందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.. వైసీపీలాగా రాజకీయ నేపథ్యం ఉన్నవారికి చైర్మన్ పదవి ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నారట.. ఎన్వీ రమణకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. ఎన్వీ రమణకు పదవి కట్టబెట్టి.. తిరుమల నుంచి రాజకీయ పెత్తనాన్ని దూరం చేశాననే పేరు పొందాలని చంద్రబాబు ఆలోచనట..అందుకే ఈ తరహా నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది.. మరికొద్దిరోజులు బోర్డును ప్రకటించాల్సి ఉన్ననేపథ్యంలో.. ఎన్వీ రమణకే చంద్రబాబు మొగ్గు చూపారని విశ్వసనీయ సమాచారం..

Read more RELATED
Recommended to you

Exit mobile version