కొడుకు అసమర్ధుడిగా మిగిలిపోవడంతో… బాబు కొత్త ఆలోచన!

-

నవ్యాంధ్రలో మొట్టమొదటి సారిగా జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి బలమైన కారణాల్లో మొదటిది “బీజేపీలో మోడీ గాలి కాగా… జనసేన నుంచి వచ్చిన కొత్త వేడి” అనేది విశ్లేషకులు గట్టిగా చెప్పిన మాట! దాంతో అధికారంలోకి వచ్చిన బాబు… అనంతర కాలంలో తన మార్కు రాజకీయం ఎలా జరిగింది, వారి కూటమి ఏమయ్యింది అనేది అందరికీ తెలిసిన సంగతే! ఆ సంగతి అలా ఉంటే… అనంతరం 2019లో ఈ సారి బాబు ఒంటరిగా బరిలోకి దిగారు… దాంతో వారి అసలు బలం కాస్త బయటపడింది! అనంతరం.. ఇప్పట్లో తేరుకునే పరిస్థితి టీడీపీకి లేదనేది స్పష్టమవుతున్న ఈ పరిస్థితుల్లో బాబు మళ్లీ కొత్త ఆలోచన చేస్తున్నారంట!

తండ్రికి 40ఏళ్ల రాజకీయ అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర, చేతిలో గ్రౌండ్ లెవెల్ కేడర్ బలంగా ఉన్న పార్టీ… అన్నీ కలిసి వచ్చినా కూడా చినబాబు లోకేష్… వాటిని ఉపయోగించుకుని ఎదగడంలో.. ఈ వయసులో తండ్రికి రాజకీయ ఆసరాగా ఉండటంలో పరిపూర్ణంగా విఫలమయ్యారు! తన తర్వాత పార్టీ నందమూరి వారి చేతిల్లోకి వెళ్లకుండా… నందమూరి తారకరామారావు పేరును సైతం మెళ్లమెళ్లగా పక్కనపెట్టి… “రామన్న” పేరు స్థానే “చంద్రన్న” పేరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి… తన తదనంతరం ఇది పూర్తిగా నారావారి పార్టీగా నిలబెట్టాలని, ఇంకెప్పుడూ నందమూరివారు ఈ పార్టీపై ఎలాంటి ఆశలూ పెట్టుకోకూడదని బాబు భావించి ఉండొచ్చు! కానీ… లోకేష్ ఈ ఆలోచనలను అన్నీ నీరుగార్చేశారు!

అందొస్తాడనుకున్న కొడుకు కాస్త అసమర్థుడిగా మిగిలిపోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ – జనసేనలతో చెట్టాపట్టాలేసుకుని మరో మహా కూటమి ఏర్పాటు చేయాలనే దిశగా బాబు అడుగులు వేస్తున్నారంట! అందుకు పవన్ ఒప్పుకున్నా… జనసైనికులు సుతారమూ ఒప్పుకోరని విశ్లేషకులు చెబుతున్న సంగతి అలా ఉంచితే… ఈ మద్యకాలంలో బాబు మాత్రం మోడీ భజన మామూలుగా చేయడం లేదు. సాష్టాంగనమస్కారాలు మినహా దాదాపు అన్ని పనులూ చేస్తున్నట్లుగానే అతి వినయం నటిస్తున్నారు బాబు! విశాఖలో 12 మంది మరణిస్తే… వారిని చూడటానికి సైతం మోడీ అనుమతి కోరే స్థాయికి బాబు దిగజారిపోయారంటే… బాబు అతి వినయం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు!

దీంతో 2024లో తన “యువనాయకుడి”ని నమ్ముకుని రంగంలోకి దిగితే ఈసారి సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అయ్యే ప్రమాధం లేకపోలేదని గ్రహిస్తోన్న బాబు… ఈ మహాకూటమికి ప్లాన్స్ వేస్తున్నారని తెలుస్తోంది! బీజేపీకి ప్రస్తుతం ఆ అవసరం లేకపోయినా… కన్నా లక్ష్మీనారాయణ సహాయ సహకారాలతో మోడీ కాళ్లో కడుపో పట్టుకుని ఒక తాటిపైకి తేవాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారంట! ఇక పవన్ – బీజేపీ ఎలాగూ అధికారికంగా కలిసే ఉంటున్నట్లు కాబట్టి… ఒక్క బీజేపీని గనుక బాబు ఒప్పిస్తే, ఫ్రీ గిఫ్టుగా పవన్ కూడా వచ్చి చేరినట్లే అవుతుందనేది బాబు స్కెచ్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న బాబు ప్లాన్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది తెలియాలంటే… ఇంకాస్త కాలం వేచి చూడాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Exit mobile version