బాబుకు బిగ్ సపోర్ట్..కానీ జగన్ తగ్గేదెలే!

-

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి..రిమాండ్ లో ఉన్న టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మద్ధతు బాగానే వస్తుంది. ఆయన్ని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారనే నేతలు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జనసేన, కమ్యూనిస్టులు, కొందరు బి‌జే‌పి నేతలు బాబుకు మద్ధతుగా నిలిచారు. జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి, ఫరూక్ అబ్దుల్లా..ఇలా పలువురు జాతీయ నేతలు మద్ధతు ఇస్తున్నారు.

బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది సరికాదని, పైగా బి‌జే‌పి, వారి మద్ధతు దారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని…బి‌జే‌పిని సైతం టార్గెట్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో పార్టీలకు అతీతంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పి నేతలు బాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. బండి సంజయ్, భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా కొందరు నేతలు బాబు అరెస్ట్ సరికాదని అంటున్నారు. ఇదే సమయంలో కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో బాబు అరెస్ట్ పై భిన్న వాదనలు జరుగుతున్నాయి.

అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, ఇదంతా కక్షపూరితమని చర్చ నడుస్తోంది.  ఇక ఈ స్కిల్ అంశం మొదలుపెట్టిన పీవీ రమేష్ సైతం జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. అటు స్కిల్ డెవలప్‌మెంట్ లో కీలకంగా ఉన్న  డిజైన్‌టెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఖన్వేల్కర్‌ సైతం.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో మోసం లేదు, దగా లేదని,  ఇది క్లీన్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పుకొచ్చారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక, సీఐడీ రిపోర్ట్‌ రెండూ తప్పే అని,  ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చు, ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీస్‌లకు సంబంధించి మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎవరైనా పరిశీలించుకోవచ్చని అన్నారు. ఇలా ఈ కేసులో బాబుకు మద్ధతు వస్తుంది.

అదే సమయంలో ఈ కేసుతో పాటు ఇంకెన్ని కేసులు ఉంటే అన్నిటిల్లో బాబుని టార్గెట్ చేయాలని జగన్..అధికారులకు ఆదేశాలు జారీ చేశారనే చర్చ నడుస్తోంది. అటు లోకేష్, టి‌డి‌పి ముఖ్యనేతలని కూడా వదలకూడదని చెప్పినట్లు సమాచారం. రాజధాని భూములు, ఫైబర్‌నెట్‌, నీటిపారుదల రంగం, కార్మిక శాఖ తదితర విభాగాల్లో చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న నిధుల తరలింపు వ్యవహారాలపైనా దృష్టి సారించాలని అధికారులకు జగన్‌ స్పష్టం చేశారని అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version