చైనాకు షాకిచ్చిన నరేంద్ర మోదీ.. ?

-

 

ప్రపంచానికి చైనా ప్రమాదకరంగా మారుతుందా అంటే నిజమే అంటున్నారు నిపుణులు.. ఎందుకంటే ప్రపంచదేశాల ఆర్ధికాభివృద్ధి పతనానికి మూలకారణమైన కరోనా వైరస్ చైనా సృష్టించిన ఆయుధమే అన్న విమర్శలు తలెత్తుతున్న నేపధ్యంలో, ఇదంతా తమపై చల్లుతున్న బురదగా, కావాలని నిందలు వేస్తున్నారని చైనా కల్లబొల్లి కబుర్లు చెప్పింది.. కానీ అమెరికా ఈ విషయంలో ఉడుంపట్టు పట్టి నిజనిజాలు వెల్లడించాలని ఒత్తిడి తెచ్చిన నేపధ్యంలో ఎక్కడ తమ అరాచకాలు బయటకు వస్తాయో అనే భయంతో నిజాలను దాచి ఎదురుదాడికి దిగింది..

ఒక అమెరికా మీదనే కాదు.. చైనాను కరోనా వైరస్ విషయంలో ప్రశ్నించిన ప్రతిదేశంతో దూకుడుగా ప్రవర్తిస్తూ వాణిజ్య సంబందాలను తెంపేసుకుంటాం అంటూ భయపెడుతుంది. తాజాగా భారత్‌ను కూడా భయపెట్టాలని చూసింది.. ఇందులో భాగంగా ఇండియా.. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వార్‌లో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని, కనీసం వత్తాసు కూడ పలకవద్దని తమ మాట వినని పక్షంలో భారత్ పై దాడులు చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వర్చువల్ సమ్మిట్‌లో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందాం అని ఆస్ట్రేలియా ప్రధానికి పిలుపునిచ్చారు. హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కలిసి పని చేసే విషయమై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయని తెలిపారు.. అంతే కాకుండా అమెరికాతోనూ కూడా భారత్ ఇలాంటి ఒప్పందాన్నే చేసుకుంది.. ఇకపోతే చైనాలో కరోనా ఎలా పుట్టింది, వ్యాప్తి చెందిందనే విషయాన్ని సమీక్షించాలని ఆస్ట్రేలియా కూడా చైనాను డిమాండ్ చేసిన నేపధ్యంలో ఆస్ట్రేలియాతో వాణిజ్య ఘర్షణలు లేవనెత్తింది చైనా..

 

ఇలా తమను ప్రశ్నించిన ప్రతి దేశంతో విరోధాన్ని పెంచుకుంటు వెళ్లుతున్న చైనా చివరకు ప్రపంచానికి ప్రమాదకరంగా మారి యుద్దాలకు తెరలేపవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్న నేపధ్యంలో మోదీ వ్యూహత్మకంగా ముందుకెళ్లుతూ తమ పోరాటంలో ఆస్ట్రేలియాను కూడా భాగస్వామిని చేశాడు.. ఇక ఈ విషయంలో చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version